మన దేశంలో మానవరహిత యుద్ధ విమానాల తయారీలో మరో ముందడుగు పడింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఆధారంగా దేశీయంగా అభివృద్ధి చేసిన డెమాన్ స్ట్రేటర్ జెట్‌ను డీఆర్ డీవో విజయవంతంగా ప్రయోగించింది. శుక్రవారం కర్నాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్టు రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. విమానం దానంతట అదే పైకి లేచి గాల్లో ప్రయాణించి, తిరిగి ల్యాండ్ అయిందని డీఆర్డీవో వెల్లడించింది.
