కొండాపూర్ గెలాక్సీ అపార్ట్మెంట్ 9వ అంతస్తుల్లో మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం

హైద్రాబాద్ లోని కొండాపుర్ లో భారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొండాపూర్ లోని గాలక్సీ అపార్ట్ మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం (31 డిసెంబర్ 2024) గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. 

గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కు మంటలు అంటుకోవడంతో పొగలు వ్యాపించాయి. సిలిండర్ పేలిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అపార్ట్ మెంటు వాసులు బయటకు పరుగులు తీశారు.  

గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఒకరు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.