టైంపాస్ కోసం డ్యూటీకి వస్తున్నారా..?

  • రెవెన్యూ ఆఫీసర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

కంగ్టి, వెలుగు : ధరణి సమస్యలతో రైతులు తొమ్మిదేళ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంటే ఎందుకు పరిష్కరించడంలేదని ఖేడ్​ఎమ్మెల్యే సంజీవరెడ్డి రెవెన్యూ అధికారులపై ఫైర్​ అయ్యారు. టైం పాస్ చేయడానికి డ్యూటీకి వస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మండలంలోని ఎంపీపీ మీటింగ్ హాల్ లో మీడియాతో మాట్లాడారు. వారంలోగా భూములు కోల్పోయిన రైతుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే జాబ్ కు రిజైన్ ఇంటికి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్, ఎంపీడీవో కురుమ సత్తయ్య పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్ : పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణాన్ని మనం కాపాడితే అది మానవ మనుగడను కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి సూచించారు. అనంతరం పట్టణంలోని చారిత్రాత్మిక కాశీనాథ్ ఆలయంలో, దత్తగిరి దేవాలయంలో రుద్రయాగం, మహాయజ్ఞం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అనుపమ రెడ్డి దంపతులు పాల్గొని శివయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు.