రన్నింగ్​ లారీలో మంటలు 

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఏరియాలో హార్డ్​వేర్​ సామాగ్రి లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగి సరుకు మొత్తం కాలిపోయింది. లారీ క్యాబిన్​ మినహా వెనుక భాగం దగ్ధమైంది. వివిధ రకాల హార్డ్​వేర్ సామగ్రితో వెళ్తున్న 14 టైర్ల లారీ బుధవారం రాత్రి 10 గంటలప్పుడు జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఏరియాకు చేరుకునే టైంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్​పక్కకు ఆపి పారిపోయాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.