పాత ఫారెస్ట్  ఆఫీసులో అగ్నిప్రమాదం

అమ్రాబాద్, వెలుగు : మండల కేంద్రంలోని పాత ఫారెస్ట్  ఆఫీసులో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఆఫీస్​ లోపల కట్టెలు, చెత్త ఉండడంతో మంటలు ఎగిసిపడడంతో పక్కనే ఉన్న పోలీస్, ఫారెస్ట్  క్వార్టర్స్  సిబ్బంది అప్రమత్తమయ్యారు.

100కు సమాచారం ఇవ్వడంతో ఫైర్  సిబ్బంది దేవేందర్, మల్లేశ్, తులసీరాం ఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.