రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. చూస్తుండగానే పూర్తిగా దగ్ధం

రన్నింగ్ కారులో మంటలు చెలరేగి ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శంషాబాద్ మండల పరిధిలోని మదనపల్లి దగ్గర కారులో మంటలు చెలరేగాయి. ఒకే కుటుంబంలోని నలుగురు 2024 మార్చి 13న తెల్లవారు జమున 3 గంటల ప్రాంతంలో మదనపల్లి వద్దకు చేరుకోగానే కారులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే కారులో ఉన్నవారంత కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాల వ్యవధిలోనే కారులో మంటలు పూర్తిగా వ్యాపించాయి. ఈ సమాచారాన్ని స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు బకెట్లు, డ్రమ్ములతో నీటిని తీసుకొచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకీ మంటలు అదుపులోకి రాలేదు.. చివరికి కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.