మౌలాలి నుంచి రాయిచూర్​ వెళ్తున్న గూడ్స్​  రైలులో మంటలు

జడ్చర్ల, వెలుగు: మౌలాలి నుంచి రాయిచూర్​ వెళ్తున్న గూడ్స్​ రైలులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. శుక్రవారం రాయిచూర్​ వెళ్తున్న గూడ్స్​లో మంటలు రావడం గమనించిన లోకో పైలెట్లు జడ్చర్ల స్టేషన్​లో నిలిపివేశారు. అంతకుముందే ఫైర్​ స్టేషన్​కు​సమాచారం ఇవ్వడంతో  వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. రైల్వే ఉన్నతాధికారులు వచ్చిన తరువాత నష్టం అంచనా వేసి వివరాలు వెల్లడిస్తారని రైల్వే అధికారులు తెలిపారు.