చెన్నై ఎగ్మోర్‌ రైలులో పొగలు.. గద్వాల స్టేషన్‌లో నిలిపివేత

గద్వాల, వెలుగు: కాచిగూడ నుంచి చెన్నై వెళ్తున్న రైలులో పొగలు వ్యాపించడంతో గద్వాల స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొద్దిసేపు నిలిపివేశారు. వివరాల్లోకి వెళ్తే... 17653 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గల ఎగ్మోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదివారం కాచిగూడ నుంచి చెన్నై బయలుదేరింది. గద్వాల రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోకి రాగానే ఎనిమిదవ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీ బోగీ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై, కేకలు వేశారు.

పొగలను గమనించిన రైల్వే ఆఫీసర్లు గద్వాల స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైలును ఆపి ప్రయాణికులను కిందికి దించి వేశారు. ఏసీ టెక్నీషియన్స్‌‌ వచ్చి పొగ రావడానికి గల కారణాలను గుర్తించారు. ఏసీ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద బ్యాటరీ వద్ద బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగే క్రమంలో అది బర్న్‌ కావడం వల్లే పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. సమస్యను పరిష్కరించి, గంట తర్వాత రైలును చెన్నై పంపించి వేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.