చంద్రబాబు ఇంటి సమీపంలో ఫైర్ యాక్సిడెంట్ కలకలం

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంటికి దగ్గరలో ఉన్న తాటి చెట్లకు ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఇది ఒక హై సెక్యూరిటీ జోన్ కావడంతో.. పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే.. నిప్పులు ఎగిసిపడుతున్న సమయంలోనే పలువురు హైకోర్టు జడ్జీలు అటుగా వెళ్లారు. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మంటల్ని అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలేంటనేవి  ఇంకా తెలియాల్సి ఉంది.