ఉప్పరపల్లి ఆర్కే గోడౌన్​లో అగ్ని ప్రమాదం

శామీర్ పేట,  వెలుగు :  శామీర్​ పేట మండలంలో  తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరపల్లిలో   కరెంట్​ షాక్​తో శుభకార్యాల అలంకరణ సామగ్రి నిల్వ ఉండే చోట అగ్ని ప్రమాదం జరిగింది.  అగ్నిమాపక, పోలీస్ శాఖ అధికారులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... ఉప్పర పల్లి  శివారులోని పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలోని  ఓ గోదాంలో శుభకార్యాలకు సంబంధించి అలంకరణ చేసే భారీ సెట్టింగ్​లు  సామగ్రిని కార్పెట్స్ ఓ గోదాంలో పెట్టారు. 

ప్రమాదవశాత్తు ఆదివారం ఉదయం కూలీలు ఉండే గదిలో  కరెంట్​ షాక్​  తో  మంటలు అంటుకున్నాయి.     అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా  రెండు ఫైర్ ఇంజన్లతో వచ్చి, మంటలు ఆర్పేశారు.  ఈ ప్రమాదంలో సుమారు 3,4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని  నిర్వాహకులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.