ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లోని ఓ ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప సొసైటీ మెయిన్​రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి సమీపంలోని బిల్డింగ్ ఐదో అంతస్తులో నిపుణ్​ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్​పేరుతో ఐటీ కంపెనీ నడుస్తోంది. బుధవారం న్యూఇయర్​సందర్భంగా హాలిడే ఇవ్వడంతో ఉద్యోగులు ఎవరూ ఆఫీసుకు రాలేదు. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో నిపుణ్​ఆఫీసు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్​స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. ఫైర్​ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇన్వెర్టర్ ​బ్యాటరీలు కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు ​ఫైర్ ఆఫీసర్ మహ్మద్ ఫైజల్ తెలిపారు.