సంగారెడ్డి కలెక్టరేట్‎లో అగ్ని ప్రమాదం.. కంప్యూటర్, ఫైళ్లు దగ్ధం

సంగారెడ్డి కలెక్టరేట్‎లో 2024, నవంబర్ 25న అగ్ని ప్రమాదం జరిగింది. కలెక్టరేట్ మొదటి అంతస్తు‎లోని సీపీఓ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సీపీఓ కార్యాలయంలోని ఏసీ, కంప్యూటర్, కొన్ని ఫైళ్లు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తు్న్నారు. సీపీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.