పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం

పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం

పార్లమెంట్ లో శీతాకాల సమావేశలు కొనసాగుతున్న విషయం తెలిసింది. గత మూడు రోజులుగా పార్లమెంట్ లో సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో బుధవారం పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో పార్లమెంటులోని 59వ గదిలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు.  మంటలు అంటుకున్న కొద్దిసేపటికే అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేయగలిగాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.