SSV company fire Accident: ఆరుగంటలుగా ఆరని మంటలు..జీడిమెట్లలో ఏం జరుగుతోంది?

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో ఫైర్ యాక్సిడెంట్..కుత్భుల్లాపూర్ లోని SSV కంపెనీ మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. పదుల సంఖ్యలో ఫైరింజన్లు..ఫైర్ సిబ్బంది..ఆరు గంటలుగా మంటలార్పేందుకు ప్రయత్నం.. అయినా ఆరని మంటలు.. జీడీమెట్లలో ఏం జరుగుతోంది.. 

మంగళవారం (నవంబర్ 26) మధ్యాహ్నం..జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ లో SSV కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..ఉవ్వెత్తున ఎగిసిపడు తున్నాయి. నిమిషం కాదు..గంటకాదు ఏకంగా ఏడున్నర గంటలుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి..పది ఫైరింజన్లు, పదుల సంఖ్యలో ఫైర్ సిబ్బంది పని చేసి నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే దాదాపు 34 ట్యాంకర్ల వాటర్ ను మంటలార్పేందుకు వినియోగించారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. 

SSV ఫ్యాక్టరీ మొత్తం మూడంతస్తుల్లో నిర్వహించబడుతోంది..ఫాలిథిన్ కవర్ల తయారీ పరిశ్రమ..ఎలా మంటలంటుకున్నాయో స్పష్టమైన వివరాలేవు గానీ.. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు..మొత్తం కంపెనీకి వ్యాపించాయి.. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో పై రెండంతస్తులు పూర్తిగా కాలిపోయాయి..ఇక మిగిలింది కింది ఫ్లోర్.. కింది అంతస్తులో మొత్తం పాలిథీన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు నిల్వచేశారు..ఇది గనక అంటుకుంటే కంపెనీ మొత్తం మంటలకు ఆహుతి అయినట్లే.

SSV ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది..దాదాపు ఏడున్నర గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్ని స్తున్నారు. పదిఫైర్ ఇంజన్లు..పదుల సంఖ్యలో ఫైర్ సిబ్బంది.. ట్యాంకర్ల కొద్దీనీళ్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. 

GHMC, DRF సిబ్బంది, చుట్టు పక్కల నాలుగు స్టేషన్ల పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.  రాత్రి సమ యం కావడంతో మంటలార్పే ప్రయత్నాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి.