చిన్న చిన్న విషయాల్లో మన నిర్లక్ష్యం పెను ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించే సమయంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోకపోవటం, ఒకవేళ నిబంధనలు ఫాలో అయినా ఫైర్ సేఫ్టీ యంత్రాల పనితీరుపై నిఘా లేకపోవటం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటన వైజాగ్ లో చోటు చేసుకుంది. కమర్షియల్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
ALSO READ :- అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ మృతి
విశాఖ జిల్లా కొత్త గాజువాకలోని ఆకాష్ బైజూస్ అకాడమీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవటంతో భారీగా ఆస్తి నష్టం జరిగిన్నట్లు సమాచారం అందుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల కమర్షియల్ కాంప్లెక్స్ లోని మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. కమర్షియల్ కాంప్లెక్స్ లో ఫైర్ సేఫ్టీ యంత్రాలు పనిచేయకపోవడంతో ఆధునిక అగ్నిమాపక యంత్రాలు వాడుతన్నప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ సేఫ్టీ యంత్రాలు పనిచేయకపోవడం వల్లే ఆస్తి నష్టం ఎక్కువయ్యిందని సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.