Astrology: వేలి ముద్రలు చూసి ఎలాంటి వారో చెప్పొచ్చు..

ఫేస్​ రీడింగ్​... హస్తసాముద్రికం... పుట్టిన తేది... పేరు.. ఇలా అనేక రకాలుగా మనిషి వ్యక్తిత్వం...స్వభావం.. జీవితంలో జరిగే మంచి చెడులను జ్యోతిష్యనిపుణులు అంచనా వేసి చెబుతుంటారు.  అయితే ఇప్పుడు వేలిముద్రల ఆధారంగా కూడా వ్యక్తిత్వం..వారు ఎలాంటి వారు.. ఏవిధంగా ప్రవర్తిస్తారో తెలిసిపోతుందని కొంతమందిఅంచనా వేస్తున్నారు. 

వేలిముద్రలు.. మన ఐడెంటిటీని చెప్పడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఆర్ధిక లావాదేవీలైనా, క్రైమ్ సంబంధిత అంశాలైనా కూడా ఒక నిర్దోషిని గానీ.. ఒక నేరస్థుడిని పట్టుకోవడంలో వీటినే ఆధారంగా చేసుకుంటారు నిపుణులు. మరి అలాంటి వేలిముద్రలు మీ గురించి ఏ విషయాలు చెబుతాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా.?

న్యూరోసైన్స్, జెనెటిక్స్, డెర్మటోగ్లిఫిక్స్, సైకాలజీ విభాగాల్లో జరిగిన కొన్ని పరిశోధనలు.. వేలిముద్రలు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చునని తేలింది. వేలిముద్రలు అనేవి సాధారణంగా మూడు రకాలుగా విభజించబడ్డాయి. అవే లూప్స్, కర్క్స్, వోర్డ్స్. ప్రతి రకం విభిన్న వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయని పరిశోధకుల అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు.. ఎంప్లాయిస్​ అటెండన్స్​ కు కూడా Finger impression  ను ఉపయోగిస్తున్నారు. కొన్ని కార్పొరెట్​ స్కూళ్లలో విద్యార్థుల అటెండన్స్​ కు కూడా ఈ పద్దతినే ఉపయోగిస్తున్నారు. 

శంఖు ఆకారం(లూప్స్): ఈ ఆకారంతో వేలిముద్రలున్న వ్యక్తులు చాలా నెమ్మదస్తులు, అలాగే ప్రశాంతమైన స్వభావం కలిగినవారు. ఎప్పుడూ అందరికంటే వెనుక తాము ఉన్నామని ఆలోచించే వ్యక్తులు వీరట. మొదలుపెట్టే పని ఏదైనా కూడా..  వీరు కష్టపడుతూనే ప్రారంభిస్తారు. సానుభూతి వీరికున్న ఏకైక లక్షణం.. దీనితో స్నేహితులను సంపాదించుకుంటారు. నిజాయితీగా ఉన్నామంటూ డప్పుకొట్టుకుంటారు. ఎక్కువగా పగటికలలు, ఊహల్లో విహరిస్తుంటారు. వీరికి ఏ పనిలోనూ సంతృప్తి ఉండదు. ఎప్పుడూ బోర్ ఫీల్ అవుతుంటారు. అందుకే ఉద్యోగాలు కూడా ఎక్కువగా మారుతుంటారు.

వంపు గీతలు(కర్వ్): ఈ ఆకారంతో వేలిముద్రలున్నవారు చాలా ధైర్యవంతులు.. గుండె నిండా ఆత్మవిశ్వాసం కలిగి ఉండటమే కాదు.. ప్రతీ పనిలోనూ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. స్ట్రాంగ్ పర్సన్స్ కూడా వీరు. ఒక పని విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవ్వరూ కూడా వీరిని దాని నుంచి తప్పించడం కష్టం. ఆచరించే నమ్మకాలైనా, స్నేహితులైనా.. అన్నింటా నిజాయితీగా ఉంటారు. సోమరితనం వీరికి ఉండదు. మారుతున్న ప్రపంచంతో వీరు ఎక్కువగా మారారు.

వృత్తాకారం(వోర్డ్స్): ఈ ఆకారంతో వేలిముద్రలు ఉన్నవారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువగా రిజర్వ్ గా ఉండటమే కాదు.. వారికి నచ్చినట్టుగా పనులు చేయడానికి ఇష్టపడతారు. చుట్టూ ఉండే పరిస్థితులను తమ విజయానికి వినియోగించుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య..స్వార్ధంతో పాటు కొంచెం స్వతంత్ర భావాలు.. అలాగే మనసులోని విషయాలను ఇతరులతో పంచుకోవడం లాంటివి వీరిలోని కొన్ని లక్షణాలు. వీరికున్న తెలివి, ప్రతిభ, అలాగే క్రియేటివ్ థాట్స్ విజయం వైపు వెళ్లేలా చేస్తాయి.