న్యూఢిల్లీ:ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మనదేశంలో బెస్ట్ బిజినెస్ స్కూల్ అని ఫైనాన్షియల్ టైమ్స్(ఎఫ్టీ) ‘గ్లోబల్ ఎంబీయే ర్యాంకింగ్స్ 2023’ ప్రకటించింది. ఈ ఏడాది టాప్–50 ఇన్స్టిట్యూట్లలో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న బిజినెస్ స్కూల్ ఇదొక్కటే కావడం విశేషం. ఐఎస్బీకి గ్లోబల్‌గా 39వ ర్యాంకు, ఆసియాలో టాప్–6 ర్యాంక్ వచ్చింది. ఉమెన్ స్టూడెంట్ల సంఖ్య, కెరీర్ ప్రోగ్రెస్, జీతాల పెరుగుదల, మాజీ స్టూడెంట్ల నెట్వర్క్ వంటి పారామీటర్లలో ఐఎస్బీ ముందంజలో ఉంది. పరిశోధనల విషయంలోనూ తాము చాలా విజయాలు సాధించామని, ఇందుకు 61వ ర్యాంక్ వచ్చిందని ఇన్స్టిట్యూట్విడుదల చేసిన స్టేట్మెంట్లో పేర్కొంది. ఇక ముందు కూడా పరిశోధనలకు మరింత ఇంపార్టెన్స్ ఇస్తామని స్పష్టం చేసింది. ‘‘ఫైనాన్షియల్ టైమ్స్(ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీయే ర్యాంకింగ్స్‌లో క్రమం తప్పకుండా మాకు స్థానం దక్కుతోంది. రీసెర్చ్ ఆధారిత టీచింగ్‌కు పెద్దపీట వేయడమే ఇందుకు కారణం. మా టీచింగ్స్ మెథడ్స్ కూడా ఆధునిక పద్ధతుల్లో ఉంటాయి. మా ఇన్స్టిట్యూట్ నుంచి పట్టాలు అందుకున్న వాళ్ల కెరీర్స్ చాలా బాగుంటున్నాయి. ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు” అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిప్యూటీ డీన్ (అకడమిక్ ప్రోగ్రామ్స్) ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై చెప్పారు. 2019లో ఐఎస్బీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(పీజీపీ) పూర్తి చేసిన స్టూడెంట్లతో ఈ ర్యాంకింగ్స్ కోసం సర్వే చేశారు. తమ క్లాసుల్లో పెద్ద ఎత్తున మహిళా స్టూడెంట్లు ఉన్నారని, కెరీర్, జీతాలు చాలా బాగున్నాయని, ఐఎస్బీ కెరీర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయని వీళ్లు చెప్పారు.
మాజీ స్టూడెంట్ల (అలుమ్నీ) నెట్వర్క్ బలంగా ఉందని పేర్కొన్నారు. పీజీ స్టూడెంట్లకు అద్భుతమైన విద్యను అందించామని చెప్పడానికి ఈ ర్యాంకింగ్స్ రుజువని సంస్థ ప్రకటించింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీయే ర్యాంకింగ్ 2023లో టాప్– 5 బిజినెస్ స్కూల్స్‌లో... కొలంబియా బిజినెస్ స్కూల్ (యూఎస్), ఇన్‌సీడ్ (ఫ్రాన్స్/సింగపూర్), ఈస్ బిజినెస్ స్కూల్ (స్పెయిన్), హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (యూఎస్), స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (యూఎస్) ఉన్నాయి. ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐఎం ఇండోర్, ఐఐఎం లక్నో టాప్–100లో చోటు సంపాదించాయి. పోయిన ఏడాది నాలుగు బీ–స్కూల్స్ ర్యాంకులు దక్కించుకున్నాయి. ఈసారి అహ్మదాబాద్ ఐఐఎం ర్యాంకు 62 నుంచి 51కి మెరుగుపడింది. అయితే ఐఎస్బీ ర్యాంక్39 నుంచి 32 కి తగ్గింది. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, 2023 ఎడిషన్‌కు మొత్తం 142 ఇన్స్టిట్యూట్లు ర్యాంకింగ్స్ కోసం పోటీపడ్డాయి. ఐఐఎం బెంగళూరు 52వ స్థానంలో, ఐఐఎం కలకత్తా 76, ఐఐఎం ఇండోర్ 89, ఐఐఎం లక్నో 90వ స్థానంలో నిలిచాయి.
