ఇకపై స్పెషాలిటీ వైద్య సేవలు

  • మెదక్‌లో మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ క్లియరెన్స్
  • జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం అనుసంధానం
  • అందుబాటులోకి రానున్న స్పెషలిస్ట్  డాక్టర్లు
  • మెరుగుపడనున్న  వైద్య సేవలు

మెదక్, వెలుగు: ఎట్టకేలకు మెదక్‌లో మెడికల్ కాలేజీ మంజూరు అయింది. ఈ అకాడమిక్​ఇయర్​నుంచే మెడికల్​ కాలేజీ ప్రారంభం కానుంది. పట్టణ శివారు పిల్లికొటాల్‌లోని పాత కలెక్టరేట్ బిల్డింగ్‌లో కాలేజీ నిర్వహణకు అనుగుణంగా మౌలిక వసతులు, మెడికల్ ఎక్విప్ మెంట్ సమకూర్చారు.  ప్రిన్సిపల్‌ తో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ప్రొఫెసర్లు, అసోసియేట్​ప్రొఫెసర్లు తదితర స్టాప్ 76 మంది జాయిన్ అయ్యారు.

ఈ సారి 50 మంది స్టూడెంట్స్‌కు ఇక్కడ ఎంబీబీఎస్​ కోర్సు చదివే అవకాశం లభించనుండటంతో పాటు, 130 బెడ్స్​కెపాసిటీ గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి,100  బెడ్స్​కెపాసిటీ  మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్​) లను, కొత్తగా నిర్మిస్తున్న 50 బెడ్స్​ కెపాసిటీగల క్రిటికల్​ కేర్​ సెంటర్​ ను మెడికల్ కాలేజీకి అనుసంధానించడం వల్ల అక్కడ వైద్య సౌకర్యాలు, సేవలు మెరుగుపడనున్నాయి. 

ఇక 24 గంటలు వైద్య సేవలు

మెడికల్​ కాలేజీకి అనుసంధానించడం వల్ల జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్​లో 24 గంటల వైద్య సేవలు అందడంతో పాటు, వివిధ విభాగాల్లో సూపర్​ స్పెషాలిటీ  వైద్య సేవలు అందుబాటులోకి  రానున్నాయి. దీనివల్ల  రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి పరిస్థితి సీరియస్​గా ఉన్న బాధితులను హైదరాబాద్ కు రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడి జిల్లా ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

టీచింగ్​ హాస్పిటల్​ లో డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ (డీ ఎం ఈ) ద్వారా  జనరల్​ మెడిసిన్​, జనరల్ సర్జన్​, గైనిక్​, ఆర్థో, ఈఎన్​టీ, ఆప్తమాలజీ, డెర్మటాలజీ డాక్టర్​లు, రేడియాలజిస్టులు నియమితులవుతారు.బిల్డింగ్​ లకు రూ.180 కోట్లు 2023లో అప్పటి ప్రభుత్వం మెదక్​ మెడికల్​ కాలేజీ, హాస్టల్​ బిల్డింగ్​ ల నిర్మాణం కోసం రూ.180 కోట్లు మంజూరు చేసింది.

ఈ మేరకు రెవెన్యూ అధికారులు పట్టణ శివారులోని ఎంసీహెచ్​ ముందు భాగంలో  మెదక్​ - చేగుంట మెయిన్​ రోడ్డు పక్కనే 14 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇపుడు నేషనల్​ మెడికల్​ కౌన్సిల్​ నుంచి మెడికల్​ కాలేజీకి  పర్మిషన్​  రావడంతో కొత్త బిల్డింగ్​ నిర్మాణానికి లైన్​ క్లియర్​ అయ్యింది. నిర్మాణం పూర్తయితే ఎంబీబీఎస్​ స్టూడెంట్స్​కు, ప్రొఫెసర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది.