పూణె: ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీతో కలసి దేశీ కంపెనీ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు డీజీసీఏ ఆమోదం తెలిపింది. ఎస్‌ఐఐ సమర్పించిన డేటాను పరిశీలించిన ఎక్స్‌పర్ట్ కమిటీ ఈ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు తాము పడిన శ్రమకు తగిన ఫలితం వచ్చిందన్నారు.
Happy new year, everyone! All the risks @SerumInstIndia took with stockpiling the vaccine, have finally paid off. COVISHIELD, India's first COVID-19 vaccine is approved, safe, effective and ready to roll-out in the coming weeks. pic.twitter.com/TcKh4bZIKK
— Adar Poonawalla (@adarpoonawalla) January 3, 2021
‘అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు. వ్యాక్సిన్ తయారీలో సీరం ఇన్ స్టిట్యూట్ పడిన శ్రమకు చివరకు ఫలితం దక్కింది. భారత్ లో ఆమోదం పొందిన తొలి సురక్షిత, ప్రభావవంతమైన, వాడకానికి సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్ కొవిషీల్డ్’ అని పూనావల్లా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ తోపాటు ఐసీఎంఆర్, డీబీటీ, డీసీజీఐ, గేట్స్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపారు.
