ఉమ్మడి నల్గొండ జిల్లా తుది ఓటరు జాబితా విడుదల

  • జిల్లాల్లో మహిళా ఓటర్లు 15,11,939 మంది
  • పురుషులు 14,63,142
  • ట్రాన్స్​ జెండర్లు 205
  • ఒక్క దేవరకొండలోనే పురుషులు ఎక్కువ

నల్గొండ, యాదాద్రి, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 29,75,491 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జిల్లా ఎన్నికల అధికారి తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో పురుష ఓటర్ల కంటే మహిళలు 3 లక్షలకు పైబడి ఉన్నారు. ఒక్క దేవరకొండలోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మిగిలిన 11 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.

 టాన్స్​జెండర్లు నల్గొండలో ఎక్కువగా ఉన్నారు. ఓటర్లు వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో  చూసుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టర్లలో తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నారు. ఓటరు జాబితాలో పేర్లు మిస్సయితే తిరిగి చేర్చుకునేందుకు అవకాశం ఇస్తారు.  

నల్గొండలో 15.06 లక్షలు..

నల్గొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా, అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,506,236 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 7,42,559 మంది పురుషులు, 7,63,550 మంది మహిళా ఓటర్లు,127 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. అలాగే 543 మంది  సర్వీస్ ఓటర్లు ఉండగా, అందులో 518 మంది పురుషులు,25 మంది మహిళ సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇక అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో 2,64,430 మంది ఓటర్లు ఉండగా 1,32,611 మంది పురుషులు, 1,31,800 మహిళా ఓటర్లు, 19 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

 నాగార్జునసాగర్​లో 2,37,597 మంది ఓటర్లు ఉండగా 1,16,278 పురుషులు, 1,21,300 మహిళా ఓటర్లు, 19 మంది ట్రాన్స్ జెండర్లు, మిర్యాలగూడలో 2,37,561 ఓటర్లు ఉండగా 1,16,222 పురుషులు, 1,21,313 మహిళా ఓటర్లు, 26 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. నల్గొండ నియోజకవర్గంలో 2,51,411 మంది ఓటర్లు ఉండగా,  1,22,222  పురుషులు, 1,29,133 మహిళలు, 56 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. మునుగోడు2,59,926 మంది ఓటర్లు ఉండగా , 1,29,235 పురుషులు, 1,30,688 మహిళలు, 03 ట్రాన్స్ జెండర్లు ఉన్నారు, నకిరేకల్​లో 2,55,311 మంది ఓటర్లు ఉండగా, 1,25,991 పురుషులు, 1,29,316 మహిళలు, నలుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 

సూర్యాపేటలో 10.08 లక్షలు..

సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో  10,08,151 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4,92,466 మంది పురుష ఓటర్లు, 5,15,628 మంది మహిళా ఓటర్లు, 57 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వీటితోపాటు 482 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా, వీటిలో 461 మంది పురుషులు, 21 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 2,61,357 ఓటర్లు ఉండగా, వీటిలో 1,29,654 మంది పురుషులు, 1,31,697 మంది మహిళలు, 6 మంది ట్రాన్స్ టెండర్లు ఉన్నారు. 

ALSO READ : పనులన్నీ పెండింగే.. వారంలో ప్రారంభంకానున్న ఐలోని జాతర

హుజూర్ నగర్ లో 2,53,110 మంది ఓటర్లలో 1,22,663 మంది పురుషులు,1,30,430 మంది మహిళు, 17 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. కోదాడలో 2,47,247 మంది ఓటర్లలో 1,20,150 మంది పురుషులు, 1,27,077 మంది మహిళలు, 20 మంది ట్రాన్స్ జెండర్లు, సూర్యాపేటలో 2,46 00 38 మంది ఓటర్లు ఉండగా, 1,19,999 మంది పురుషులు, 1,26,424 మంది మహిళలు, 14 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

యాదాద్రిలో 4.60 లక్షలు..

యాదాద్రి జిల్లాలో పూర్తిగా ఉన్న భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు ఉండగా, పాక్షికంగా తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తిగా ఉన్న భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 4,60,899 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,28,117 మంది పురుషులు, 2,32,761 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 

భువనగిరిలో మహిళా ఓటర్లు 1,12,830 మంది ఉండగా, పురుషులు 1,09,820 మంది ఉన్నారు. ట్రాన్స్​ జెండర్ ఒక్కరే ఉన్నారు. ఆలేరులో 1,19,931 మంది మహిళలు ఉండగా, పురుషులు  1,18,297 మంది ఉన్నారు. ట్రాన్స్​​జెండర్లు 20 మంది ఉన్నారు.