ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టి… కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, అందుకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం తరుఫు నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని… కరోనా పరిస్థితులపై SEC నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. అధికారుల బృందం SEC తో చర్చించిన అంశాలను తెలపాలంది. దీనికి సంబంధించి ఈ నెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.
