వనపర్తిలో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం

  • సందడి చేసిన అనసూయ భరద్వాజ్

వనపర్తి, వెలుగు: వనపర్తి పట్టణంలో కాసం ఫ్యాషన్స్ 15వ స్టోర్ ను సోమవారం సినీ నటి, యాంకర్  అనసూయ భరద్వాజ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ ఈ స్టోర్ ను వనపర్తి లో తాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలాఉంటే అనసూయ పట్టణానికి వస్తున్నారని తెలిసి పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతవాసులు తరలిరావడంతో వనపర్తి– కొత్తకోట రోడ్డు కిటకిటలాడింది. 

జనాలను చూసి అనసూయ కొన్ని స్టెప్పులు వేసి అలరించారు.  షాపింగ్  మాల్  డైరెక్టర్లు నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్  మాట్లాడుతూ ఏపీ, తెలంగాణాలో 15వ స్టోర్​ను ప్రారంభించామని చెప్పారు. ప్లానింగ్  బోర్డు వైస్  చైర్మన్  చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మార్కెట్  కమిటీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.