Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్  ఎమోషనల్ అయ్యాడు. నేను ఫ్యాన్స్ ను సంతోష పెట్టేందుకే మేం సినిమాలు తీస్తున్నాం..సంధ్యా థియేటర్ ఘటన రేవతి, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను సినిమా చూస్తున్నానని ప్రచారం సాగుతోంది.. ఇది ఎంతో బాధించిందన్నారు అల్లు అర్జున్. 

సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హీరో అల్లు అర్జున్ వల్లే ప్రమాదం జరిగింది. ఓ ప్రాణం పోయిందని. సెలబ్రిటీ పబ్లిక్ లోకి వచ్చేటపుడు పర్మిషన్ తీసుకోవాలని.. లేకుండా ఇలాగే జరుగుతుందని అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్.. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కన్నీరు పెట్టారు. పాజిటివ్ ఇంటెన్షన్ తో చేసినా కూడా ఇది ఫ్యూర్లీ యాక్సిండెంటల్.. థియేటర్ కు వచ్చిన జనాలను ఎంటర్ టైన్ చేయడమే నా లక్ష్యం.. థియేటర్ మాకు టెంపుల్ లాంటిది.. అలాంటి థియేటర్ లో ఏదైనా జరిగితే ఏదైనా జరిగితే బాధపడకుండా ఉంటామా అని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. 

నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది..నా క్యారెక్టర్ ను తప్పుగా క్రియేట్ చేస్తున్నారు. నేను చాలా బాధపడుతున్నాను.. అన్ని ఈవెంట్లు వదిలేసి ఇంట్లో కూర్చు న్నానని అల్లు అర్జున్ అన్నారు. ఇరువైఏళ్లుగా సంధ్యా థియేటర్ కు వెళ్తున్నాను. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. సంధ్యాథియేటర్ సంఘటన దురదృ ష్టకరం..నాకు ఎంతో బాధ కలిగించిందని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు.