బిజినెస్ డెస్క్, వెలుగు: ట్యాక్స్‌పేయర్లు 2020–-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు కేవలం ఒక నెలే ఉంది. ఈసారి ఐటీ రిటర్న్- ఫైలింగ్ మునుపటి కంటే వేరుగా ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ కొత్త ఐటీ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్‌లో చాలా మార్పులు చేసింది. పాత వెర్షన్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. కొత్త టెక్నాలజీల వల్ల ఈ పోర్టల్ ఇప్పుడు బాగానే పనిచేస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి ముందుగా ట్యాక్స్‌పేయర్.. అసెస్‌మెంట్ ఇయర్‌ను, పన్ను విధానం గురించి స్పష్టంగా తెలియజేయాలి. శాలరీడ్ ట్యాక్స్‌పేయర్లు రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో కూడా రెండు పన్ను విధానాల మధ్య ఏదో ఒకదానికి మొగ్గుచూపవచ్చు. అంటే, మీరు గతంలో పాత పన్ను విధానం ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్‌లను డాక్యుమెంట్లు ఇచ్చినా, ఈ పోర్టల్ ద్వారా కొత్త విధానానికి మారడానికి వీలుంటుంది. ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ ద్వారా సంపాదించిన డివిడెండ్ ఆదాయాన్ని కూడా లెక్కల్లో చూపాల్సి ఉంటుంది.
ఏమేం చేయాలంటే..
- ఈ–-ఫైలింగ్ పోర్టల్ ద్వారా శాలరీడ్ ట్యాక్స్‌పేయర్లు ఐటీ రిటర్న్‌లను ఫైల్ చేయడానికి ముందు .. గత సంవత్సరం రిటర్న్‌లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు, ఫారమ్-16 ఫారమ్ 26 ఏఎస్‌లు వంటి డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు కొత్త పోర్టల్ www.incometax.gov.in కు వెళ్లాలి. ఇదివరకే నమోదు చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. పాన్ కార్డే లాగిన్ ఐడీ అవుతుంది.
- మెయిన్ డ్రాప్‌డౌన్ మెను నుండి ఈ–-ఫైల్ ట్యాబ్‌కు వెళ్లి ప్రాసెస్ మొదలుపెట్టాలి. ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. అసెస్‌మెంట్ సంవత్సరాన్ని కూడా పేర్కొనాలి. ప్రైవేట్ ఇ–-ఫైలింగ్ పోర్టల్‌ల మాదిరిగానే, ఇందులో కూడా మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయొచ్చు. గతంలో ఎక్కువగా ఐటీఆర్-1 ఐటీఆర్-4ఎస్ సేవలు మాత్రమే ఉండేవి.
- ఇప్పుడు మీరు ఉపయోగించాల్సిన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాలి. 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో చాలా మంది శాలరీడ్ ట్యాక్స్‌పేయర్లు మ్యూచువల్ ఫండ్లు లేదా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లు ఐటీఆర్-2 ఫారమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- రిటర్న్‌లను ఫైల్ చేయడానికి తదుపరి స్టెప్‌కు వెళ్లాలి. మీరు రిటర్న్‌లను ఎందుకు దాఖలు చేస్తున్నారనే విషయాన్ని తెలియజేసే విండో ఇప్పుడు ఓపెన్ అవుతుంది. -సంబంధిత షెడ్యూల్‌లను నింపండి. - ఇదివరకే నింపిన సమాచారాన్ని అవసరమైతే సవరించండి లేదా వెరిఫై చేయండి.
- శాలరీ షెడ్యూల్‌లో వివరాలను, డిడక్షన్లను మళ్లీ తనిఖీ చేసి వెరిఫై చేయండి. ముఖ్యంగా జీతం, తగ్గింపులను, క్యాపిటల్ గెయిన్స్‌ను వెరిఫై చేయాలి. మీ రిటర్న్ సమ్మరీని సరిచూసుకోవాలి. ఇప్పుడు రిటర్న్‌లను సబ్మిట్ చేయాలి. రిటర్న్‌ను సమర్పించే ముందు వెరిఫికేషన్‌ను పద్ధతిని సెలెక్ట్ చేసుకోవాలి.
- నెట్‌బ్యాంకింగ్, ఆధార్- ఓటీపీ, డీమ్యాట్ అకౌంట్ లేదా ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ)ని క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి రిటర్న్‌లను (మెయిన్ మెనూ> ఇ-–-ఫైల్> ఐటీ రిటర్న్> ఇ-–వెరిఫై రిటర్న్) వెరిఫై చేస్తే సరిపోతుంది.
