కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయగా రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశాకు, బిహార్ గవర్నర్‌గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు, కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బిహార్‌కు బదిలీ చేసింది. మిజోరం గవర్నర్‌గా జనరల్ విజయ్ కుమార్ సింగ్‌ను, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.
గవర్నర్ పదవి
- రాష్ట్రానికి ప్రథమ పౌరుడు.
- రాజ్యాంగంలోని ఆరో భాగంలో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరణ ఉంటుంది. అందులో గవర్నర్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి, అడ్వకేట్ జనరల్ అంతర్భాగంగా ఉంటారు.
- ఆర్టికల్ 153: ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు.
- ఆర్టికల్ 154: ప్రకారం గవర్నర్, రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరిస్తారు.
- ఆర్టికల్ 155: గవర్నర్ నియామకం
- ఆర్టికల్ 156: గవర్నర్ పదవీకాలం
- ఆర్టికల్ 157: గవర్నర్‌గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు
- ఆర్టికల్158: గవర్నర్‌గా నియమితులయ్యే వారికి సంబంధించిన అర్హతలు, జీతభత్యాలు, నివాస భవనం వివరిస్తుంది.