వాస్తు: మీ ఇంటికి నైరుతి ఎక్కువ ఉందేమో చూసుకోండి.. కూకట్పల్లిలో ఏం జరిగిందంటే..

నైరుతి పెరిగితే..

మూడేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నా. ఉన్న ఇంటికి నైరుతి ఎక్కువ. చాలామంది ఇల్లు వదిలి వేరే ఇంటికి షిఫ్ట్ కావాలని చెప్తున్నారు. మారడం తప్పదా?

-సౌజన్య, కూకట్పల్లి, హైదరాబాద్

ఇల్లు మారకుండానే మార్పులు చేసుకోవచ్చు. నైరుతి భాగం పడమర, దక్షిణం వైపు పెరిగితే.. ఆ భాగాన్ని విడగొట్టాలి. పూర్తిగా కూల్చేసి మూసేయాలి. ఆర్థిక, అనారోగ్య సమస్యలు కనుక ఉంటే వెంటనే మార్చుకోవాలి. లేదంటే అలా వదిలేయొచ్చు. ఒకవేళ వీలుకాకపోతే నైరుతి భాగాన్ని స్టోర్ రూంగా మార్చుకొని వాడుకోవచ్చు.. రూమ్కు తాళం వేసి ఉంచాలి.

ఇంటి వెనకాలే కట్టుకుంటే..
మా ఇల్లు ఉత్తరం వైపు ఉంది. ఇంటి వెనుకాలే కొంత ఖాళీ స్థలం ఉంది. అక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చా?
-నరేశ్. వికారాబాద్

ఇంటి వెనకాలే పెట్రోల్ బంక్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఇంటికి, బంక్కు మధ్య గ్యాప్ ఉండాలి. కాంపాండ్ లేదా ప్రహరీ కట్టి కమర్షియల్ కాంప్లెక్సుగా వాడుకోవచ్చు. వాస్తు పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

ALSO READ | ఆధ్యాత్మికం : బుద్ధియోగం అంటే ఏంటీ.. గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన జీవిత సత్యం ఇదే..!

ఓపెన్ కిచెన్ ఓకేనా?
మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు తూర్పు ముఖంగా ఉంది. ఉత్తరం వైపు మరో దర్వాజ ఉంది. పడమర వైపు వెనుక రెండు బెడ్రూమ్లు . ముందు హాల్లోనే ఆగ్నేయం మూలలో ఓపెన్ కిచెన్ పెట్టాలనుకుంటున్నాం. దీనికి ఎలాంటి డిజైన్ తీసుకోవాలి. అలాగే పూజ గది ఎక్కడ ఉండాలి? ఉత్తరం వైపు మెట్లు వచ్చాయి. దాని కింద  బాత్ రూం కట్టుకోవచ్చా? లేక వాయువ్య మూలలోనే బాత్రూం కట్టుకోవాలా?
 -నర్సయ్య, యాదాద్రి

ఓపెన్ కిచెన్ పెట్టుకోవచ్చు. కాకపోతే తూర్పు ముఖం వైపు మాత్రమే ఉండేలా ఏర్పాటుచేసుకోవాలి. కిచెన్ సమీపంలో ఖాళీ స్థలం ఉంటే పూజ గదిని కూడా. ఏర్పాటుచేసుకోవచ్చు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బాత్రూం మాత్రం ఉత్తర వాయువ్యంలో మెట్లు ఉంటేనే కట్టాలి.

కాశీనాథుని శ్రీనివాస్
వాస్తు కన్సల్టెంట్
ఫోన్: 9440088799