తుఫాన్ వచ్చేసింది.. పేరు ఫెంగల్.. ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడ వాన

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తుఫాన్​ హెచ్చరికలు జారీ చేసింది.  హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్​ కి ఫెంగల్​ గా నామకరణం చేశారు.  ఇక్కడ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి... తమిళనాడు తీరప్రాంతాల్లో  వర్షాలు పడుతున్నాయి.  ఈ అల్పపీడ నం ఆదివారం నాటికి ( నవంబర్​ 24) వ తేదీ నాటికి బలపడి తుఫాన్​ గా మారుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ తెలిపింది.  ఈ తుఫానుకు ఫెంగల్​ తుఫాన్​ గా సౌదీ అరేబియా పేరు పెట్టింది. 

ఫెంగల్​ ప్రభావంతో శనివారం నాటికి ( నవంబర్​ 23) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది.  ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ... దక్షణ బంగాళాఖాతంలో మధ్య భాగంలో వాయుగుండంగా మారుతుంది.  దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీలలో  కోస్తాంధ్ర ప్రాంతాలతో సహా.. తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు  పడే  అవకాశం ఉంది.   ఈ సీజన్‌లో సంభవించబోతోన్న మూడో తుఫాన్ ఇది. 

ప్రస్తుతం ఈ అల్పపీడనం ఇండోనేసియాలోని సుమత్ర- అండమాన్ నికోబార్‌ ద్వీప సమీపంలో కేంద్రీకృతమైంది. ఫెంగల్​ తుఫాన్​ ప్రభావంతో ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న  తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఒక మాదిరిగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది .దేశంలోని పలు ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులతో చచెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. 

తెలంగాణలో  ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్​, వరంగల్​, మెదక్​ లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్​ లో దట్టంగా మేఘాలు కమ్ముకొని ఒక మాదిరిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.  ఇక ఆంధ్రప్రదేశ్​ లో కాకినాడ, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్లతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి పుట్టపర్తి, దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.