సంగీత మొబైల్స్ తో చేతులు కలిపిన ఫీడింగ్ ఇండియా

సంగీత మొబైల్స్ తో చేతులు కలిపిన ఫీడింగ్ ఇండియా
  • కోవిడ్ బాధితులతోపాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు పౌష్టికాహారం 
  • 10 లక్షల భోజనాలు అందించేందుకు సిద్ధం: ఫీడింగ్ ఇండియా బై జొమాటో

న్యూఢిల్లీ: జొమాటోకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్‌ ఇండియా మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్‌ రిటైలర్‌ సంగీతా మొబైల్స్‌ తో చేతులు కలిపింది. కోవిడ్ బాధితులోపాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు పది లక్షల భోజనాలు అందించేందుకు రెడీ అవుతోంది. తమ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలలో పది లక్షల (ఒక మిలియన్‌) భోజనాలను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా కోవిడ్‌ బాధిత కుటుంబాలకు అందించనుంది. పోషకాలతో కూడిన ఆహారాన్ని లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఫీడింగ్‌ ఇండియా తమ 100కు పైగా పంపిణీ భాగస్వాముల సహకారంతో చేస్తుంది. అదే సమయంలో  కోవిడ్‌–19 మార్గదర్శకాలైనటువంటి భౌతిక దూరం, కాంటాక్ట్‌లెస్‌ పంపిణీ సహా అన్ని మార్గదర్శకాలనూ అనుసరిస్తున్నామనే భరోసానూ అందిస్తుందని ఫీడింగ్‌  ఇండియా బై జొమాటో హెడ్ చైతన్య మాథుర్‌ వెల్లడించారు. కోవిడ్‌–19 ప్రభావిత కుటుంబాలతో సహా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు  మా ‘డెయిలీ ఫీడింగ్‌ ప్రోగ్రామ్‌’లో భాగంగా అందించనున్నామని, ముఖ్యంగా మహమ్మారి చేత తీవ్రంగా ప్రభావితమైన వారిని చేరుకోవడానికి తమ భాగస్వామ్యం సహాయపడుతుందని అన్నారు.