- అడవిని వదిలి మైదాన ప్రాంతాల్లో సంచారం
- నాలుగు రోజులుగా నర్సంపేట ఏరియాలో మకాం
- తాజాగా రాజుపేటలో పులి పాద ముద్రల గుర్తింపు
- అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్ల సూచన
నర్సంపేట , వెలుగు : వరంగల్జిల్లాలో పెద్దపులి భయం వీడడం లేదు. నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో సంచరిస్తోంది. నిన్నటి వరకు అటవీ ప్రాంతాల్లోని నల్లబెల్లి, కొత్తగూడలో కనిపించిన పెద్దపులి.. శనివారం రాత్రి మైదాన ప్రాంతమైన నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో తిరిగింది. ఇలా అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రావడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అదే మండలంలోని రాజుపేట శివారు జంగిలి తండా వద్ద పెద్దపులి పాదముద్రలను పోలీసు, ఫారెస్టు ఆఫీసర్లు కనుగొని వాటిని మగ పులివిగా నిర్ధారించారు. జంగిలితండాకు ఆదివారం ఉదయం నర్సంపేట సీఐ రమణమూర్తి, ఎస్ ఐలు రవికుమార్, అరుణ్, ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్ రవికిరణ్ వెళ్లారు.
ALSO READ : పొద్దున అటు .. రాత్రికిటు!..10 రోజుల నుంచి ఫారెస్టోళ్లకు చుక్కలు చూపుతున్న పులి
పులి పాదముద్రలను పరిశీలించారు. పంట పొలాలకు రైతులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. సాయంత్రం నాలుగు గంటల లోపే పనులు ముగించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా పెద్దపులి చిక్కకకపోవడం గమనార్హం.