పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా అందరి హృదయాలను కదిలించింది. తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుంటూ మరీ దేశం కోసం మ్యాచ్ ఆడింది. మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాక్ సెమీస్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై మ్యాచ్ ఆడింది. సోమవారం (అక్టోబర్ 14) దేశ జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురైంది. దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ కనిపించిన వీడియో వైరల్ అవుతుంది.
ఫాతిమా సనా తండ్రి (అక్టోబర్ 9) న మరణించాడు. దీంతో సనా గురువారం (అక్టోబర్ 10) తన దేశం బయలుదేరనుంది. ఈ క్రమంలో ఆమె దుబాయ్‌లో శుక్రవారం (అక్టోబర్ 11) ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌కు దూరమైంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే కివీస్ పై భారీ తేడాతో గెలిస్తే పాక్ సెమీ ఫైనల్ కు చేరేది. కానీ బ్యాటింగ్ లో ఫాతిమా సనా 22 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారు విఫలం కావడంతో మ్యాచ్ ఓడిపోయి టోర్నీనుంచి నిష్క్రమించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ ఆరంభం నుంచి ఫాతిమా సనా పాకిస్థాన్ తరఫున అత్యుత్తమంగా రాణించింది. తన కెప్టెన్ తో శ్రీలంకపై మ్యాచ్ గెలిపించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లోనూ 30 పరుగులు చేసి బౌలింగ్ లో రెండు కీలక వికెట్లు పడగొట్టింది. భారత్ తో జరిగిన మ్యాచ్ లోనో జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలను ఔట్ చేసి భారత్ కు పాక్ గట్టి పోటీ ఇచ్చేలా చేసింది.
Also Read:-రేపే టీమిండియాతో తొలి టెస్ట్.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఔట్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే 111 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. 54 పరుగుల తేడాతో గెలిచిన కివీస్.. రాయల్ గా సెమీస్ లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఫాతిమా సనా (21), ఓపెనర్ మునీబ్ అలీ (15) మినహాయిస్తే మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. నలుగురు పాక్ ఆటగాళ్లు డకౌట్ కావడం విశేషం. పాకిస్థాన్ సమిష్టిగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజి లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులకే పరిమితమైంది.
FATIMA SANA CRYING AFTER FATHER DEATH ??? @TheRealPCBMedia @ICC @imfatimasana #wolrldcup2024 pic.twitter.com/SOsoYj8ydx
— Saqib Qazzafi ?? (@qazzafi_sa82216) October 14, 2024