లక్షలు ఖర్చు పెడితే.. నా కొడుకు శవం గిప్టుగా ఇచ్చారు.. విద్యార్థి తండ్రి ఎమోషనల్

హైదరాబాద్: హయత్ నగర్‎లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‎లో లోహిత్ అనే ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్‎లోనే ఫ్యాన్‎కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కొడుకు ప్రయోజకుడు కావాలని నారాయణ పాఠశాలలో చేర్పిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. కొడుకు చదువు కోసం లక్షలు ఖర్చుపెడితే.. పాఠశాల యాజమాన్యం నా కొడుకు శవం నాకు గిప్టుగా ఇచ్చారని విలపించాడు. 

నారాయణ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం, టీచర్ల వేధింపుల వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు.
నా కొడుకు చనిపోయిన విషయం స్కూల్ యాజమాన్యం ఇప్పటి వరకు నాకు చెప్పలేదని.. పోలీసులు ఫోన్ చేస్తే విషయం తెలిసిందన్నాడు. నా కుమారున్ని చదువు విషయంలో ఎక్కువ టార్చర్ పెట్టొద్దని గతంలోనే చెప్పానని.. అయిన వారు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డడాని అన్నారు.

విద్యార్థి బాగోగులు పేరెంట్స్ కాకుండా ఇంకా ఎవరికి చెబుతారని.. చనిపోయిన తర్వాత కూడా తమకు సమాచారం ఇవ్వకపోతే ఎలా అని నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదువు ఒత్తిడి కాకుండా ఈ స్కూల్‎లో ఇంకా ఏదో జరుగుతోందని.. నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడా ఇంకా ఏమైనా చేశారా అనే అనుమానం ఉందన్నారు. 

ALSO READ : హైదరాబాద్ లో ఘోరం: నారాయణ స్కూల్ లో 7వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య..

విద్యార్థుల చావులకు కారణమవుతోన్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొడుకు మృతదేహాన్ని చూడి తండ్రి విలపించిన తీరు అక్కడ ఉన్న వారిందరి చేత కంటతడి పెట్టించింది. విద్యార్థి సూసైడ్ నేపథ్యంలో మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగే అవకాశం ఉండటంతో స్కూల్ వద్ద పోలీసులు భారీగా భద్రతా పెంచారు.