ఏంటీ వింత : తండ్రిని మందలించిన కొడుకు.. కాసేపట్లోనే శవమై..

చేతికి ఎదిగొచ్చిన కన్నకొడుకును ఓ తండ్రి చంపుకున్నాడు. ఎక్కడైనా మనం కొడుకుని మందలించిన తండ్రని చూసి ఉంటాము. కానీ ఇక్కడ తండ్రిని మందలించిన కొడుకు.. వీరన్నగారి శేఖర్(48) ఏపని చేయకుండా, జులాయిగా తిరుగుతున్నడని ఆయన కొడుకు ప్రశ్నించాడు. ఆవేశంలో అతడు కొడుకుపై దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే..

సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కర్మన్ ఘాట్ మారుతీ నగర్ లో వీరన్నగారి శేఖర్ (48) కుటుంబంతోపాటు నివాసం ఉంటున్నాడు. శేఖర్ ఏపనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించడానికి సందించడంలేదు. కొడుకు జైపాల్ (23) నవంబర్ 8న(శుక్రవారం) తండ్రి శేఖర్ ని మందలించాడు. జైపాల్ శుక్రవారం రాత్రి తండ్రి శేఖర్ తిడుతున్న క్రమంలో జైపాల్ తండ్రి శేఖర్ ఆవేశంతో కొడుకు జైపాల్ మెడ పై కూరగాయల కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన జైపాల్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సృహ కోల్పోయిన  జైపాల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన పై కేసు నమోదు చేసి, తండ్రి ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు.