డీఎస్సీలో తండ్రీ కొడుకులకు ర్యాంకులు

  • తండ్రికి తెలుగు పండిట్‌‌గా, కొడుకుకు మ్యాథ్స్‌‌లో ర్యాంకు

మరికల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో తండ్రి కొడుకుల కు స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ ఉద్యోగాల్లో ర్యాంకులు వచ్చా యి. నారాయణ పేట జిల్లా మరికల్ మండలం రాకొం డకు చెందిన తండ్రి గోపాల్ తెలుగు పండిట్‌‌గా జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించగా, కొడుకు భాను ప్రకాశ్‌‌ మ్యాథ్స్‌‌ సబ్జెక్ట్‌‌లో 9వ ర్యాంక్ సాధించారు. కాగా, గోపాల్‌‌ ఇంట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం.

గోపాల్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు జడ్చర్లలో స్థిరపడ్డారు. భార్య విజయలక్ష్మి ఇది వరకే తెలుగు పండిట్‌‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల కింద వారి రెండో కొడుకు చంద్రకాంత్‌‌ ఏఈఈ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మొదటి కొడుకు భానుప్రకాశ్‌‌ ప్రస్తుతం స్కూల్‌‌ అసిస్టెంట్‌‌లో 9వ ర్యాంకు సాధించాడు. తండ్రికొడుకులు డీఎస్సీలో మంచి ర్యాంక్​ తెచ్చుకోవడం పట్ల గ్రామస్తులు వీరిని అభినందిస్తున్నారు.