వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు టిప్పర్ ను బలంగా ఢీ కొట్టింది. యాక్సిడెంట్ జరిగిన వేగానికి కారు ఇంజన్ ఊడిపోయి రోడ్డు మీద పడింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్-బీజాపూర్ హైవే పై వస్తున్న కారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్ గుర్తి గేటు వద్దకు రాగానే అటుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని అతివేగంగా ఢీ కొట్టింది. యాక్సిడెంట్ జరిగిన వేగానికి కారు ఇంజన్ ఊడిపోయింది.
ALSO READ :- వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీసీసీబీ చైర్మన్
కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. యాక్సిడెంట్ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.