పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బంజేరుపల్లి తండా దగ్గర శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిపేర్ కారణంగా రోడ్డు మధ్యలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‎పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను బంజరు పల్లె గ్రామానికి చెందిన రాజశేఖర్ (28), బానోత్ సంతోష్(26) గా గుర్తించారు పోలీసులు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.