ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ లోనే మృతి..

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోట వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే మృతి చెందారు. కారులో ఉన్న మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, దగ్గర్లోని ఆస్పత్రులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 

గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాక్సిడెంట్ కు గురైన కారు మారుతి సుజూకి చెందిన ఎర్టీగా వెహికల్ గా గుర్తించారు. కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిపారు. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు చెప్పారు.