హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన కనెక్ట్ గ్యాడ్జెట్స్ ఇండియాలో తొలి ఫాస్టెస్ట్ చార్జింగ్ పవర్‌బ్యాంక్‌ను లాంచ్ చేసింది.జీల్ అల్టిమా పేరుతో 100 వాట్స్ తో 20,000
ఎంఏహెచ్ సామర్థ్యంతో కంపెనీ దీనిని రూపొందించింది. యూఎస్ కు చెందిన సెమికండక్టర్స్ తయారీ కంపెనీ టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ చిప్‌ను ఇందులో వాడారు. ధర రూ.4,999గా ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్ ను ఇది 50 నిమిషాల్లో చార్జ్ చేస్తుంది.ఇతర పవర్‌బ్యాంక్స్ తో పోలిస్తే మూడు రెట్లు మెరుగ్గా పనిచేస్తుం దని కనెక్ట్ గ్యాడ్జెట్ స్ సీవోవో ప్రదీప్ యెర్రగుంట్ల తెలిపారు.
