జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
వాహనాలకు ఇకపై ఫాస్టాగ్ లు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ లు ఉంటేనే టోల్ ప్లాజాల దగ్గర అనుమతించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీని ద్వారా టోల్ ప్లాజాల దగ్గర ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకెళ్లవచ్చన్నారు. వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ…ఫాస్టాగ్ తో టోల్ ప్లాజాల దగ్గర ప్రయాణికుల సమయం తో పాటు.. ఇంధనం కూడా ఆదా అవుతుందని తెలిపారు. ఫాస్టాగ్ వ్యవస్థను దేశంలో 2016లో తీసుకువచ్చారు. 2018  వరకు 34 లక్షల ఫాస్టాగ్ లు జారీ అయ్యాయి. ఈ ఏడాది నవంబరులో కేంద్రం జారీ చేసిన ఆదేశాల్లో… పాత వాహనాలకు, 2017 డిసెంబరు 1వ తేదీకి ముందు అమ్ముడైన వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. అంతేకాదు… కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 ప్రకారం 2017 డిసెంబరు 1 నుంచి  ఫోర్ వీలర్స్ వాహనాల రిజిస్ట్రేషన్ లో ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది.  రవాణా వాహనం ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలన్నా ఫాస్టాగ్ కలిగివుండాలన్న నిబంధన విధించింది.