ఇయ్యాల రూ.2 లక్షల రుణమాఫీ : జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల/శ్రీరంగాపూర్, వెలుగు: రైతులకు మూడో విడతలో గురువారం రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వీపనగండ్ల మండలం పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్​లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులను అందజేశారు.

 శ్రీరంగాపూర్​ మండల కేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్​ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్  పార్టీ తెలంగాణలో కనిపించకుండా పోతుందన్నారు. అనంతరం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గోదల బీరయ్య యాదవ్, ఎత్తం కృష్ణయ్య, రఘునాథ్ రెడ్డి, నారాయణరెడ్డి, గంగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.