రుణమాఫీ కాని రైతులు గ్రీవెన్స్ సెంటర్లకు వెళ్లాలి

వికారాబాద్, వెలుగు: జిల్లాలో రుణమాఫీ కానీ రైతులు మండలాల్లోని ఫిర్యాదుల కేంద్రాలకు వెళ్లాలని వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ సూచించారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షలలోపు రుణమాఫీ రైతులకు వర్తించిందని, పలు కారణాలతో  అర్హులైన రైతుల రుణమాఫీ కాకుంటే గ్రీవెన్స్ సెంటర్లలో దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో తప్పులు పడితే.. సరి చేసుకోవాల్సిందిగా రుణమాఫీ రైతులను కోరారు.