రైతుల ఆదాయం రెట్టింపు చేయడం తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు. నీటి ఎద్ధడి సమస్యను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న 100 జిల్లాల్లో తగు చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక చేపడతామని తెలిపారు. అలాగే కొత్తగా 20 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లను అందజేస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్.
పోడు భూముల్లోనూ సోలార్ యూనిట్లు పెట్టుకునే అవకాశం రైతులకు కల్పిస్తామన్నారు నిర్మలా సీతారామన్. ఆయా సోలార్ యూనిట్లను పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. పంటలు పండని ఆ భూముల్లో సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా రైతులకు లీజ్ రూపంలో ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో తెలిపారు.
