బిల్లులు చెల్లించాలని రైతుల ధర్నా

ఆమనగల్లు, వెలుగు: రెండు నెలలుగా పెండింగ్​లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్  చేస్తూ గురువారం కడ్తాల్  పాల శీతలీకరణ కేంద్రం ఆవరణలో పాడి రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ డెయిరీ తమకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. విజయ డెయిరీ ఎండీని కలిస్తే 20 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం లీటర్ కు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి 38 నెలలుగా చెల్లించకుండా మోసం చేసిందన్నారు. రామకృష్ణ, రంగన్న, నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్, అశోక్ రెడ్డి, కుమార్, సాయిప్రభు, దశరథ్, సత్యం, నరేశ్​ పాల్గొన్నారు.