గండీడ్‌‌‌‌‌‌‌‌ పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌లో లోన్ల అక్రమాలపై ఎంక్వైరీ చేయాలి

గండీడ్, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా గండీడ్ పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌లో లోన్ల అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు బ్యాంకు సిబ్బందిని బ్యాంకులోనే బంధించి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లోన్లు పూర్తిగా చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నప్పటికీ, మళ్లీ లోన్లు ఉన్నట్లు చూపి వాటిని కాజేసేందుకు బ్యాంక్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌లో అసలు లోన్లే తీసుకోకున్నా తీసుకున్నట్లు చెబుతున్నారని, రైతు లోన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డేటా చూపించాలంటే చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గిరమోని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విచారణ జరిపి ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీఈవో మాట్లాడుతూ పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. రైతుల నిరసనకు బీజేపీ మండల అధ్యక్షుడు విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నరహరిరెడ్డి, మద్దతు తెలిపారు.