పాల డబ్బుల కోసం రైతుల ఆందోళన

రేగోడ్, వెలుగు :  రేగోడ్ మండల కేంద్రంలోని విజయ డైరీ ఆధ్వర్యంలో నడిచే పాలకేంద్రం వద్ద శుక్రవారంపాడి రైతులు ఆందోళన చేశారు. మూడు నెలలుగా పాలు డబ్బులు అకౌంట్​లో జమ చేయడంలేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా స్పందించి తమ పాల డబ్బులు సక్రమంగా అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో రామకృష్ణయ్య, సాయిలు, శివకుమార్, సంగమేశ్వర్, ఇతర పాల రైతులు పాల్గొన్నారు.