సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విండోకు తాళం వేసిన రైతులు

నిజామాబాద్, వెలుగు: వడ్ల కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్కలు సరిగా లేవంటూ, సొసైటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం, ఖర్చులో అవకతవకలు జరుగుతున్నాయంటూ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కొనసముందర్​ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విండోకు శనివారం రైతులు తాళం వేశారు. కమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని కొనసముందర్​ సింగిల్​విండో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాపురెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హినాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీసీ తాండకు చెందిన రైతులు హాజరయ్యారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాగానే గత యాసంగి, ఖరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీజన్లకు సంబంధించి సొసైటీ తరఫున వడ్ల కొనుగోలుకు వచ్చిన కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చించారు. 

రెండు సీజన్లకు కలిపి సుమారు రూ.80 లక్షల వరకు కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుందని, దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. దీంతో సెక్రటరీ రాజేశ్వరం లెక్కలు సరిగా చెప్పకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో రికార్డులను సరి చేసి చూపుతానని సెక్రటరీ సమాధానం ఇచ్చారు. దీంతో రికార్డులను తారుమారు చేయకుండా, తమ సమక్షంలోనే రాయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ సొసైటీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాళం వేశారు. మంగళవారం మరోసారి మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలని తీర్మానించారు.