ధాన్యం కొనుగోలు చేయక రైతుల ఇక్కట్లు : రామచంద్రారెడ్డి

 

  •     కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేపీ నాయకులు

గద్వాల టౌన్, వెలుగు: ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో జిల్లాలో  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని లత్తిపురము, బీరెల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం రైతులు కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యం పరిశీలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ..   రైతులకు ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో వడ్ల కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్నాల తోపాటు దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండల వెంకట్ రాములు, వెంకటేశ్వర్ రెడ్డి,  కృష్ణ, ఓంకార్, మసుదన్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.