రెండవ విడత రైతు ఋణమాఫీతో రైతుల సంబురాలు

వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత రైతు ఋణమాఫీ సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల రైతులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీటు పంచుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

వర్షాభావ పరిస్థితుల వల్ల కష్టాల్లో ఉన్న రైతులకు ఋణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో మొట్టమొదటి సారిగా 31 వేల కోట్ల రైతుల ఋణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని..సీఎం రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలుకృష్ణ పేర్కొన్నారు.