రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన జంగయ్య(42) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. 

జంగయ్య తన వ్య వసాయ బావి వద్ద సాగు చేసిన పుదీన సాగు చేస్తున్నాడు. పుదీనా కోతకు రావడంతో కోసి సంచుల్లో నింపుతున్నాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం రావడంతో పుదినాను సంచుల్లో నింపుతున్న జంగయ్యపై ఒక్కసారిగా భారీ శబ్ధంతో పిడుగు పడింది. దీంతో పొలంలోనే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న మిగతా రైతులు వచ్చి చూడగా అప్పటికే జంగయ్య మృతిచెందాడు.