మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాను చనిపోయిన తర్వాత తన శరీర అవయవాలు అమ్మి.. తన కరెంట్ బకాయిలు చెల్లించాలని ఓ రైతు ప్రధాని మోడీకి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఛతర్‌పూర్ గ్రామానికి చెందిన మునేంద్ర రాజ్‌పుత్ (35) అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన వ్యవసాయంతో పాటు ఒక పిండి మిల్లును కూడా నడుపుతున్నాడు. అయితే పంటలో నష్టం రావడంతో ఆయన గత కొన్ని నెలల నుంచి తన వ్యవసాయ కరెంట్ బిల్లు రూ. 87,000 చెల్లించలేదు. దాంతో విద్యత్ సంస్థ ఆయన పిండి మిల్లును మరియు బైకును స్వాధీనం చేసుకున్నారు. దాంతో మనస్థాపం చెందిన మునేంద్ర ప్రధాని మోడీకి లెటర్ రాసి చనిపోయాడు.
‘నేను చనిపోయిన తర్వాత నా శరీర అవయవాలు అమ్మి కరెంట్ బకాయిలు చెల్లించండి. అందుకోసం నా శరీరాన్ని ప్రభుత్వానికి అప్పగించండి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మోసాలు చేస్తే ఎటువంటి చర్య తీసుకోరు. వాళ్లు అప్పు తీసుకుంటే.. తిరిగి చెల్లించడానికి వారికి తగినంత సమయం ఉంటుంది లేకపోతే అప్పు మాఫీ అవుతుంది. కానీ ఒక పేద రైతు డబ్బులు చెల్లించకుంటే మాత్రం బహిరంగంగా అవమానిస్తారు. అసలు ఆ రైతు ఎందుకు చెల్లించలేకపోతున్నాడని ప్రభుత్వం కూడా ఆరా తీయదు’ అని మునేంద్ర తన లేఖలో పేర్కొన్నాడు.
మునేంద్ర కుటుంబసభ్యుల ప్రకారం.. ‘రాజ్‌పుత్ యొక్క పంట చెడిపోయింది. అందువల్ల అతను గత కొన్ని నెలల నుంచి విద్యుత్ బిల్లు చెల్లించలేకపోయాడు. దాంతో రూ. 87 వేలు బకాయిలు వసూలు చేయాలని డిస్కామ్ ఆయనకు నోటీసు జారీ చేసింది. నోటీసు వచ్చిన కొద్ది రోజుల తరువాత డిస్కమ్ అధికారులు.. రాజ్‌పుత్ యొక్క పిండి మిల్లు, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు’ అని తెలిపారు. మునేంద్రకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు కావడం గమనార్హం.
For More News..
లేడీ ఎస్సై సూసైడ్.. రూంలో నోట్ స్వాధీనం
తొమ్మిది నెలల తర్వాత తెరుచుకున్న స్కూల్స్
వీసాలపై నిషేధాన్ని పొడిగించిన ట్రంప్
