భూ వివాదంలో రైతు ఆత్మహత్య.. చెల్లెలు వేధిస్తోదంటూ సెల్ఫీ వీడియో

రామాయంపేట/నిజాంపేట, వెలుగు: భూమి విషయంలో అక్కాచెల్లెళ్లు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు వేధిస్తున్నారంటూ ఓ రైతు నాలుగు రోజుల కింద ఆత్మహత్యకు యత్నించగా, ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా రామాయంపేట మండలం సుతార్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన రైతు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్న స్వామి (53) తన ఫౌల్ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌ వద్ద ఈ నెల 9న పురుగుల మందు తాగాడు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసి గ్రామ వాట్సప్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఫామ్‌‌‌‌‌‌‌‌ వద్దకు వెళ్లి డోర్లు పగులగొట్టి చూశారు. అపస్మారక స్థితిలో ఉన్న స్వామిని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు.

చెల్లె, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు బెదిరిస్తున్నారని సెల్ఫీ వీడియో

మృతుడు స్వామి చెల్లెలు పుష్ప భర్త చనిపోవడంతో తన కూతురితో కలిసి 25 ఏండ్లుగా సుతార్‌‌‌‌‌‌‌‌పల్లిలోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె బతుకుదెరువు కోసం ఎకరం పొలం ఇచ్చారు. పుష్ప కూతురు లావణ్యకు తొమ్మిదేండ్ల కింద వివాహమైంది. ఇదిలా ఉండగా భూమిలో తన బిడ్డకు వాటా ఇవ్వడం లేదంటూ పుష్ప తన అన్న స్వామిపై గతంలో రామాయంపేట పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసింది. అయితే వివాదాన్ని గ్రామంలోనే పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు అమర్‌‌‌‌‌‌‌‌సేనారెడ్డి, శ్రీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పుష్పను కలిసి పెద్దల సమక్షంలో పంచాయితీ తేలదని, లీగల్‌‌‌‌‌‌‌‌గానే వెళ్లాలని చెప్పారు. 

అంతే కాకుండా పుష్ప, మంజుల, అమర్‌‌‌‌‌‌‌‌సేనారెడ్డి, శ్రీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇటీవల ఫౌల్ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చి ‘బాగా ఎక్కువ చేస్తున్నావు..? అసలు నీ సంగతి ఏందిరా..? నీ అంతు చూస్తాం’ అని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు బెదిరించారని స్వామి సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ‘నేను ఎవరి చేతిలోనో చనిపోవడం ఏంటి..? నేనే ఆత్మహత్య చేసుకుంటా, నా భార్య, కూతురు, అల్లుడిని చూసుకునే బాధ్యత గ్రామస్తులదే, భూమి కోసం ఎవరూ ఒక్క రూపాయీ ఇవ్వలేదని.. నేను, నా తండ్రి కష్టార్జితంతో సంపాదించుకున్న పొలంలో ఎవరికీ హక్కు లేదు’ అంటూ పురుగుల మందు తాగి వీడియోని గ్రామ వాట్సప్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

బంధువుల ఆందోళన 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ స్వామి చనిపోవడంతో డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకువచ్చారు. అయితే కాంగ్రెస్ లీడర్ల బెదిరింపుల వల్లే స్వామి ఆత్మహత్య చేసుకున్నాడని, వారిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ స్వామి బంధువులు, కుటుంబ సభ్యులు పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టంను అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్వామి ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేసే వరుకు డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని తీసుకెళ్లేది లేదంటూ పట్టుబట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో బాధ్యులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్‌‌‌‌‌‌‌‌ చెప్పడంతో ఆందోళన విరమించారు.